MLC Jeevan Reddy : గురుకుల సిబ్బందికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చివాట్లు

by Y. Venkata Narasimha Reddy |
MLC Jeevan Reddy : గురుకుల సిబ్బందికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చివాట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులం పాఠశాలను(Alipur Gurukul School) మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy)ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన నాణ్యత లేని భోజనాన్ని చూసిన జీవన్ రెడ్డి సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు కాని పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టమని మండిపడ్డారు. రెండు గిన్నెల నిండా అన్నం వండితే పిల్లలకు సరిపోద్ది.. ఒక గిన్నెలో అన్నం చేసి సరిపడా భోజనం ఎందుకు పెట్టడం లేదని, అన్నం ఉడకలేదని, నీళ్ల పప్పు, నీళ్ల చారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారని ప్రశ్నించారు.

మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారని ఎందుకిలా అక్రమాలు చేస్తున్నారని నిలదీశారు. వారానికి ఐదు కోడిగుడ్లు కూడా ఇవ్వడం లేదని..నవంబర్ 14వ తేదీ తర్వాత మాకు గుడ్డు పెట్టలేదని విద్యార్థులు చెప్పడం..30 లీటర్ల పెరుగు వాడాల్సి ఉండగా, కేవలం 6 లీటర్ల పెరుగుతో సరిపెడుతుండటం పట్ల గురుకుల సిబ్బందిపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిశీలనలో వెల్లడైన సమస్యలపై కలెక్టర్ కు, ప్రభుత్వానికి నివేదిస్తానని స్పష్టం చేశారు.

Advertisement
Next Story

Most Viewed