- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరుకుపోయిన చెత్తాచెదారం..
దిశ, కనగల్లు: మండలంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్స్ కు చెత్త డంపింగ్ యార్డ్ లేకపోవడంతో..చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ లేకుండానే అధికారులు పర్మిషన్ ఇవ్వడంతో..ఫంక్షన్ హాల్స్ లో వెలువడే వ్యర్ధాలు విస్తరాకులు,మిగిలిపోయిన అన్నం,మొదలగు వ్యర్ధాలు ఫంక్షన్ హాల్స్ నిర్వహకులు ఇష్టానుసారంగా చెత్త పడేస్తున్నారు. దీంతో కుక్కలు, పందులు, గేదెలు చెత్తను చిందరవందర చేసేస్తుండడందో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం రాజ్యమేలుతోంది. దేవరకొండ నుంచి నల్గొండకు ధర్వేశిపురం మీదుగా నిత్యం వందలాది మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడికి రాగానే తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో..ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.