- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sama: సైకో రామ్ గ్యాంగ్‌కు పాలాభిషేకంతో సమాధానం.. సామా రామ్మోహన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ప్రజా ప్రభుత్వం(Peoples Governance)పై రాళ్ళు రువ్వించాలని కుట్రలు చేస్తున్న సైకో రామ్ గ్యాంగు(Psycho Ram Gang)కు దిలావర్‌పూర్(Dilavar Pur) ప్రజలు పాలాభిషేకంతో సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committee chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ పరిశ్రమ(Ethanal Factory)ను రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పాలాభిషేకం చేశారు.
ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. బీఆర్ఎస్ నాయకులపై(BRS Leaders) ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)లో సొంత నాయకులకోసం ప్రజలకు ఇష్టం లేకున్నా ఇథనాల్ ఫ్యాక్టరీకి నాడు అనుమతులు ఇచ్చారని విమర్శలు చేశారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఆ అనుమతులను ప్రజా ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని నాటి బీఆర్ఎస్ దగాకోరు పాలనను ఎండగడుతూ దిలావర్‌పూర్ ప్రజలు రహదారి నిర్బంధం చేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందేనని గుర్తు చేశారు. ఇక ఈ విషయం ప్రజా ప్రభుత్వం దృష్టికి రాగానే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపించినదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు పాలాభిషేకం చేశారని సామా తెలియజేశారు.