- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
No Network: ఓ వైపు 5జీ పరుగులు.. మరో వైపు సిగ్నల్ కోసం పాట్లు.. ఆ గ్రామాలిప్పుడు వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో డిజిటల్ విప్లవం వేగంగా దూసుకుపోతున్నది. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దేశంలో సాంకేతిక వినియోగం మరో మలుపు తిరిగింది. పెరిగిన నెట్ వర్క్ స్పీడ్ తో అర్బన్ ప్రాంతాల్లో నిమిషాల్లో ఆన్ లైన్ ఆర్డర్లు డెలివరీ చేయబడుతున్నాయి. అయితే ఇదంతా ఒక వైపే. మరో వైపు దేశంలో కనీసం నెట్ వర్క్ కు కూడా నోచుకోని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. రాజస్థాన్ (RAJASTHAN) లోని దుంగార్‌పూర్ జిల్లా కేంద్రానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న బల్వానియా, చార్వాడ గ్రామాల్లోని ఏడు కిలోమీటర్ల పరిధిలో టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ (No Network) లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దాదాపు 50 వేల జనాభా కలిగిన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నెట్ వర్క్ లేక దూరంలో ఉన్న స్నేహితులు, బంధువులతోనే కాదు కనీసం అంబులెన్సుకు (AMBULANCE) ఫోన్ చేయాలన్నా సమీపంలో ఉన్న కొండలు గుట్టలపైకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందేనని ఇక్కడి వాళ్లు చెబుతున్నారు.
రేషన్ కోసం ఓటీపీ తిప్పలు:
నెట్ వర్స్ సమస్య వల్ల తమకు రేషన్ సరుకులు తీసుకోవడం కూడా సమస్యగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీల కోసం లబ్ధిదారులతో పాటు రేషన్ డీలర్ (RATION DEALER) సైతం షాప్ లో కంటే కొండపైనే ఎక్కువ ఉండాల్సి వస్తుందని, అక్కడి రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తు్న 'ఇ-మిత్ర' బూత్‌లను యాక్సెస్ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరవాడ గ్రామానికి నడిచి వెళతామని చెబుతున్నారు. ఈ గ్రామాల వెంట వెళ్తుంటే ఎక్కడ చూసినా కొండలపై నిల్చుని తమ ఫోన్లను గాలిలో తిప్పుతూ నెట్ వర్క్ కోసం ప్రయత్నించే వాళ్లే కనిపిస్తుంటారు. ఫోన్ లో మాట్లాడుకోవటం ఎలా ఉన్నా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కు, విద్యార్థుల చదువులకు ఇబ్బందిగా మారిన నెట్ వర్క్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లాభదాయకంగా ఉన్న ప్రాంతాల్లో నెట్ వర్క్ లపై ఫోకస్ పెడుతున్న టెలికాం సంస్థలు ఇటువంటి రూరల్ ఏరియాలో ఎందుకు ఫోకస్ చేయడం లేదంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.