గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకోని గత ప్రభుత్వం

by Sridhar Babu |
గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకోని గత ప్రభుత్వం
X

దిశ, జగిత్యాల టౌన్ : గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలను పూర్తిస్థాయిలో పట్టించుకోలేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇటీవల గల్ఫ్ లో మృతి చెందిన 8 మంది కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారానికి సంబంధించి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల బాధలను అర్ధం చేసుకొని రూ. 5 లక్షలు అందజేయటం వల్ల వారి కుటుంబాలు ఆర్ధికంగా కొంత భరోసా కలుగుతుందని అన్నారు.

ప్రజా భవన్ లో ఎన్నారై సెల్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్,కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ల రాంచందర్ రావు, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story