- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nana Patole: ఏడు శాతం ఓట్లు ఎలా పెరిగాయో ఈసీ సమాధానమివ్వాలి.. కాంగ్రెస్ నేత నానా పటోలె
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్‌పై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే (Nana patole) మరోసారి సందేహం వ్యక్తం చేశారు. ఫలితాలు ముగిసిన తర్వాత ఓ రకమైన పోలింగ్ ఉంటే ఆ మరుసటి రోజు 7శాతం పోలింగ్ పెరిగిందని ఇది ఎలా జరిగిందో ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ గణాంకాల్లోని వ్యత్యాసాలు చూస్తుంటే ఎన్నికల సంఘం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నారు. ‘పోలింగ్ రోజున సాయంత్రం 5గంటలకు 58.22శాతం పోలింగ్ నమోంది. అనంతరం రాత్రి 11.30 గంటలకు 65.2శాతానికి పెరిగింది. మరుసటి రోజు నాటికి 66.5శాతంగా నమోదైనట్టు ఈసీ తెలిపింది. మొత్తం 7.83శాతం ఓటింగ్ పెరిగింది. దాదాపు 76లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది ఎలా జరిగిందో ఈసీ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు.
ఈ విషయంపై క్లారిటీ రావాలంటే పోలింగ్ కేంద్రాల (Polling centers) వీడియో పుటేజీలను ఈసీ రిలీజ్ చేయాలని సూచించారు. భారీగా ఓటింగ్ జరిగితే పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు కనపడేవని కానీ ఒక్క కేంద్రంలోనూ అలాంటి పరిస్థితులు కనిపించలేదని తెలిపారు. ఏయే నియోజకవర్గాల్లో ఇలాంటి క్యూలు కనిపించాయో ఆధారాలు ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కైందని ఆరోపించారు. ఈ భేదాలపై కోర్టులో సవాల్ చేస్తామన్నారు. తమ పార్టీ ఓటమి కారణంగానే ఈ అంశాలను లేవనెత్తడం లేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాత్రమే తమ పార్టీ కోరుకుంటోందని చెప్పారు.