- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాతలకు తీపికబురు చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
దిశ,నల్లగొండ: తెలంగాణలో త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 7న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, నల్గొండలోని మెడికల్ కళాశాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రిజర్వాయర్ ను ఇప్పటికే నింపడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు ఆయకట్టు పెరుగుతుందన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18 సంవత్సరాల తన చిరకాల వాంఛ నెరబొరబోతుందని అన్నారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా పాత టౌన్ హాల్లో కొత్తగా జిల్లా గ్రంథాలయంకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. వీటితో పాటు రూ.100 కోట్లతో లతీఫ్ షాప్ దర్గా, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్డులకు శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్టిమేట్ వేయడం జరిగిందని వెల్లడించారు. వీలైతే వీటిని సీఎంతో శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో పాటు, ఎంపీ,ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. శుక్రవారం సీఎం పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీని ప్రకటించి చెబుతానని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మూసీతో ఎక్కువ నష్టపోయేది, అనారోగ్యం పాలయ్యేది నల్లగొండ జిల్లా ప్రజలేనని అన్నారు. మూసీ ప్రక్షాళనతో న్యాయం జరుగుతుందన్నారు .ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గానికి సంబంధించి రెండు మిషన్లు త్వరలో జిల్లాకు చేరుకుంటాయని, 20 నెలల్లోనే సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని అన్నారు. దీంతో ఎంఆర్పితో పని లేకుండా నీళ్లు వస్తాయని తెలిపారు. రూ.500 కు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఎక్కడలేని విధంగా రూ 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇస్తున్నామని,ఇలాంటి సంక్షేమ పథకాలు బీజేపీ అధికారాల్లో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.