అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

by Naveena |
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడమే తమ అభిమతమని,చిల్లర రాజకీయాలు చేయడం తమకు రాదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక మెట్టగడ్డలోని బాల సదన్ లో 1 కోటి 35 లక్షల రూపాయల నిధులతో 'చిల్డ్రన్స్ హోం' అధునాతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మీడియాతో మాట్లాడారు. అరకొర వసతులతో,పాత భవనంలో ఇబ్బందులతో నడుస్తున్న బాల సదన్ ను గత పాలకులు పట్టించుకోలేదని,భవనం దుస్థితి చూసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అధునాతన భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చానని ఆయన అన్నారు. సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో భవన నిర్మాణం చేసుకొని అందుబాటులోకి తెస్తామని,దశల వారిగా 5 సంవత్సరాల బాల,బాలికలకు ప్లే స్కూల్ మాదిరిగా ఉండేటట్లు అందుబాటులోకి తెస్తామని,కేవలం అనాథ పిల్లలే కాకుండా పట్టణంలోని చిన్నారులు ఎవరైనా ఇక్కడ చేరవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తిరుమల వెంకటేష్,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్,మున్సిపల్ వైస్ చైర్మెన్ షబ్బీర్ అహ్మద్,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ అనిత,వైస్ చైర్మెన్ విజయ్ కుమార్,సిరాజ్ ఖాద్రీ,జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం,సిడిపిఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed