- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
దిశ, కొందుర్గు : దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతుల కోసం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పరిచారో.. అదే తరహాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కృషి చేస్తూ వస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ముట్పూర్ లో వరి కొనుగోలు కేంద్రం కొందుర్గు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు ప్రజాయోజనాలే ముఖ్య ద్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా అండగా నిలబడేందుకు అనేక రకాల చర్యలు చేపడుతూ వస్తుందని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం సన్నరకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుంచి పంటలకు భీమా సైతం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 30 నా పాలమూరులో నిర్వహిస్తున్న రైతు పండుగను పురస్కరించుకొని రుణమాఫీ రాని రైతులందరికీ రెండు లక్షలలో రుణమాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన, కృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ మహ్మద్ అలీ ఖాన్ బాబర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, అంజిరెడ్డి మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.