- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వల్లభనేని వంశీ అనుచరులకు షాక్.. కస్టడీకి అనుమతించిన కోర్టు
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi) అనుచరులకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నేత రంగబాబు(TDP leader Rangababu)పై దాడి కేసులో కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులు నెల్లూరు జిల్లా జైలు(Nellore District Jail)లో రిమాండ్ ఖైదీలు(Remand Prisoners)గా ఉన్నారు. వీరిని కస్టడీలోకి తీసుకుని రంగబాబుపై దాడికి సంబంధించి మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అభ్యర్థనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వంశీ అనుచరులను రెండు రోజులు పాటు కస్టడీకి తీసుకోనున్నారు. రంగబాబుపై దాడి వెనుక అసలు సూత్రదారులు ఎవరు అనే విషయాలపై వంశీ అనుచరులను ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం లేదా శనివారం కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అయితే పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారనే విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
కాగా గత ప్రభుత్వం హయాంలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని అనుచరులు రెచ్చిపోయారు. అధికారం మదంతో టీడీపీ నేతలపై దాడులు చేశారు. అప్పటి పభుత్వ తప్పులను ప్రశ్నించినందుకు గన్నవరం పార్క్ ఎలైట్ హోటల్ సమీపంలో రంగబాబును చుట్టుముట్టి మూకుమ్మడి దాడి చేశారు. అనంతరం పారిపోయారు. అయితే ఆ సమయంలో రంగబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికార పార్టీ నేతల ఒత్తడితో కేసు ముందు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులపై ఫోకస్ పెట్టింది. దీంతో నిందితులను పోలీసులు గుర్తించారు. రంగబాబుపై 8 మంది దాడి చేశారని గుర్తించి అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించారు.