- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
139 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సిందే: పోతిన మహేశ్ సంచలన డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: బీసీ(B.C)లను చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government) మోసం చేస్తుందని వైసీపీ నేత పోతిన మహేశ్ (YCP leader Pathina Mahesh) అన్నారు. పులలకు సింహాలకు చెట్లకు పుట్లకు లెక్కలు ఉన్నాయి కానీ, బీసీల జనాభా లెక్కలు ఎందుకు తీయరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వెంటనే కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ(Telangana)లో కుల గణన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) బీసీల ద్రోహిగా మారిపోతున్నారనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వరకు బీసీల కోసం నినాదాలు చేశారని, ఆ తర్వా ప్రేమ ఎందుకు తగ్గిపోయింతో చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను పునరుద్దించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా కుల గణన(Caste Enumeration) చేసి తీరాలని పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు.
గతంలో బీసీ ఉపకులాలకున్న 14 కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం 56కు పెంచిందని పోతిన మహేశ్ గుర్తు చేశారు. చంద్రబాబు ప్రస్తుతం 56 కార్పొరేషన్లు గాను కేవలం 15 కార్పొరేషన్లకే చైర్మన్‌లను సభ్యులను నియమకం చేసి 40 బీసీ ఉపకులాల కార్పొరేషన్లను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) కన్నా మిన్నగా బీసీలకు మేలు చేయాలంటే చంద్రబాబు 139 బీసీ కులాలకు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. బీసీలను జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులను చేశారని, వారిలో ముగ్గురు రాజీనామా చేశారని చెప్పారు. వారి స్థానంలో తిరిగి బీసీలనే నియమకం చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెలలో కుల గణన కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టతామని పోతిన మహేశ్ హెచ్చరించారు.