Breaking:‘ఈగల్‌’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Jakkula Mamatha |   ( Updated:2024-11-28 14:30:00.0  )
Breaking:‘ఈగల్‌’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ నియంత్రణ(Drug control)కు ‘ఈగల్‌’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను నెలకొల్పింది. రాష్ట్ర, జిల్లా స్థాయి నార్కోటిక్ సెల్స్‌లో 341 మంది సిబ్బంది ఉండనున్నారు. ఇందులో చేరిన వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాల్లో విచారణకు 5 ప్రత్యేక ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా, సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అటు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.

Advertisement

Next Story