గ్రామాల్లో క్రిమినల్‌ కేసుల పంచాయితీలు నిర్వహించొద్దూ.. సీఐ అనిల్‌కుమార్‌..

by Sumithra |
గ్రామాల్లో క్రిమినల్‌ కేసుల పంచాయితీలు నిర్వహించొద్దూ.. సీఐ అనిల్‌కుమార్‌..
X

దిశ, అందోల్‌ : క్రిమినల్‌ కేసులకు సంబంధించిన పంచాయితీలను గ్రామ పెద్దలు నిర్వహించొద్దని, నేరుగా పోలీసులను ఆశ్రయించాలని జోగిపేట సీఐ అనిల్‌ కుమార్‌ సూచించారు. పంచాయితీలను పెట్టి జరిమానాలను, శిక్షలను వేయడం వలన కొందరు మనోవేదనకు గురై ప్రాణాలు కొల్పోతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. చింతకుంట ఘటనలో తల్లి, కొడుకుల అత్మహత్యకు సంబంధించిన వివరాలను గురువారం జోగిపేట సీఐ కార్యాలయంలో వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన సంగారెడ్డికి చెందిన సలీం ఆటోలో చింతకుంటకు చెందిన మౌలన ఇంటికి వచ్చి, అక్కడే ఖాళీ స్థలంలో పార్క్‌ చేశాడు.

ఈ నెల 25వ తేదీన ఉదయం సలీమ్‌కు కౌడిపల్లి మండలం బుజరంపేట్‌ నుంచి ఫోన్‌ చేసి మీ ఆటో ఇక్కడే ఉందని చెప్పగా, చింతకుంటలో పార్క్‌ చేసిన ఆటో వద్దకు వెళ్లగా, అక్కడ ఆటో కనిపించలేదు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పడంతో ఈ నెల 26వ తేదీన గ్రామానికి చెందిన వడ్ల శ్యామ్‌ దొంగతనం చేశారని ఆరోపిస్తూ పంచాయితీ పెట్టారు. ఆటోను ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లినందుకుగాను రూ.5 లక్షల జరిమాన కట్టాలంటూ శ్యామ్‌ కుటుంబీకుల పై స్థానిక పెద్దలు ఒత్తిడి తెచ్చారు. దీంతో పంచాయితీ నిర్వహించడం పై తమ పరువు పోయిందని భావించి మనస్థాపానికి గురైన శ్యామ్‌ తన తల్లి బాలమణి మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబందించి మతురాలి భర్త యాదయ్య ఫిర్యాదు మేరకు మౌలాన, చాంద్‌పాషా, మహబుబ్‌అలీ, అస్లాం, శ్రీను, శ్రీశైలం, ఆంజనేయులపైన కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed