- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వండే పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి.. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్..
దిశ, జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిని పరిశీలించి, మెనూకి సరిపడా వంట సరుకులు ఉన్నాయా... మెనూకి సరిపడా గుడ్లు ఉన్నాయా, లెవా అని నిర్వాహకులను అడిగారు. ఈ క్రమంలో వారు స్పందిస్తూ.. మెనూకి సరిపడా వంట సరుకులు ఉన్నాయని, ఉల్లిగడ్డలు పాడవకుండా గాలికి ఆరబెట్టినట్లు నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు. వంట సరుకులు, వండే పదార్థాలలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, శుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారితో మమేకమై ముచ్చటించారు. మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా ? ఉదయం అల్పాహారం ఎన్ని గంటలకు పెడుతున్నారు ? అని అడిగారు.
ఈ నేపథ్యంలో వారు స్పందిస్తూ.. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని, ఉదయం అల్పాహారం 8:30 గంటలకు పెడుతున్నారని విద్యార్థులు కలెక్టర్ కు వివరించారు.అదే విధంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అభ్యాస దీపికను కచ్చితంగా అనుసరించాలని, ప్రతి రోజూ స్టడీ అవర్స్ లో గంటన్నర పాటు తప్పనిసరిగా అభ్యాస దీపికలోని గణిత శాస్త్రాన్ని సాధన చేయాలని, ఈసారి వంద శాతం ఫలితాలు సాధించాలని, 10/10 జీపీఏ రావాలంటే ప్రతి రోజూ బడికి హాజరు కావాలని, విద్యార్థులకు సూచించారు.అలాగే ప్రత్యేక తరగతిలో వారంలో నాలుగు రోజులు గణితాన్ని సాధన చేయించాలని, ప్రతిరోజూ స్టడీ అవర్స్ లో రెండు సమస్యలను ఇచ్చి పరిష్కరించేలా చూడాలని, పాత ప్రశ్న పత్రాలను సాధన చేయించాలని టీచర్లను ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.