Auto Companies: హ్యూండాయ్, కియా సహా ఎనిమిది కంపెనీలపై రూ. 7,300 కోట్ల జరిమానా

by S Gopi |
Auto Companies: హ్యూండాయ్, కియా సహా ఎనిమిది కంపెనీలపై రూ. 7,300 కోట్ల జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన తయారీ కంపెనీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరి చేసిన ఉద్గార నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా పలు కంపెనీలపై రూ. 7,300 కోట్ల మేర జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హ్యూండాయ్, కియా, మాహీంద్రా, హోండా సహా ఎనిమిది ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాటిలో అత్యధికంగా హ్యూండాయ్‌పై రూ. 2,800 కోట్లు, మహీంద్రాపై దాదాపు రూ. 1,800 కోట్లు, కియాకు రూ. 1,300 కోట్ల పెనాల్టీ విధించినట్టు తెలుస్తోంది. మిగిలిన కంపెనీల్లో హోండా, రెనాల్ట్, స్కోడా, నిస్సాన్, ఫోర్స్ మోటార్స్ కంపెనీలున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కార్పొరేట్‌ యావరేజ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ (సీఏఎఫ్ఈ) నిబంధనలను కఠినతరం చేసింది. ఈ ప్రమాణాల ప్రకారం తయారీదారులు కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు నిర్దేశించిన స్థాయిల కంటే 0-4.7 గ్రాము/కి.మీ. తక్కువగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ విషయంపై కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. నిబంధనలు 2023, జనవరి 1 నుంచి అమల్లోకి రావడంతో మొత్తం ఆర్థిక సంవత్సరనికి పెనాల్టీ విధించడం అన్యాయమని కంపెనీలు చెబుతున్నాయి.

Advertisement

Next Story