Lagacharla : లగచర్ల రైతుల బెయిల్ పిటిషన్‌పై కోర్ట్ కీలక నిర్ణయం

by M.Rajitha |
Lagacharla : లగచర్ల రైతుల బెయిల్ పిటిషన్‌పై కోర్ట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన(Lagacharla Incident) గురించి తెలిసిందే. ఈ కేసులో 16 మంది రైతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా.. కోర్ట్ రిమాండ్ విధించింది. దీంతో వీరందరిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా వికారాబాద్ జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకున్న వీరి బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రాగా.. రైతుల తరపున న్యాయవాది జకుల లక్ష్మణ్ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ఏ1 నిందితునిగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి(Patnam Narender Reddy) బెయిల్ పిటిషన్‌పై విచారణను కోడంగల్ కోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది. అయితే రిమాండ్ ను మాత్రం డిసెంబర్ 11 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story