- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Audi India: కొత్త ఫీచర్లతో క్యూ7 ఎస్‌యూవీని విడుదల చేసిన ఆడి ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడియా ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ క్యూ7 అప్‌డేటెడ్ కారును గురువారం విడుదల చేసింది. రూ. 88.66 లక్షల(ఎక్స్‌షోరూమ్) నుంచి దీని ధర ప్రారంభమవుతుందని, వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. డిజైన్ పరంగా కొత్తగా సింగిల్-ఫ్రేమ్ గ్రిల్, రీడిజైన్ బంపర్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు వంటి మార్పులను కంపెనీ చేసింది. ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో 10,000 యూనిట్ల క్యూ7 మోడళ్లను విక్స్తయించామని, కొత్త ఫీచర్లు, డిజైన్ ద్వారా మరింత మంది కస్టమర్లను సాధించగలమనే విశ్వాసం ఉందని కంపెనీ అభిప్రాయపడింది. 48వి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, ఆఫ్-రోడ్ సహా ఏడు మోడ్‌లలో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్‌లు కలిగి ఉంది. భద్రతకు సంబంధించి లేన్ డిపార్చర్ వార్నింగ్, పార్క్ అసిస్ట్ ప్లస్, ఎనిమిది ఎయిర్‌బ్యాగులు, కంఫర్ట్ కీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. ఆడి రెండేళ్ల ప్రామాణిక వారెంటీతో పాటు ఏడేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం కల్పిస్తోంది. పదేళ్ల కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.