డ్రైనేజీలో పడి చిన్నారి మృతి

by Naveena |
డ్రైనేజీలో పడి చిన్నారి మృతి
X

దిశ, ఆర్మూర్ : ఆడుకుంటూ ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి చిన్నారి మృతి చెందింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని 35వ మున్సిపల్ వార్డులో రామ్ నగర్ ఏరియాలో సంఘటన చోటుచేసుకుంది. దీంతో రామ్ నగర్ ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాంనగర్ కు చెందిన మట్ట ధనశ్రీ (4) చిన్నారి ఆడుకుంటూ 7 ఫీట్ల లోతుగా ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందింది. చిన్నారి డ్రైనేజీలో పడిన విషయం తెలియక కాలనీవాసులు చిన్నారి కోసం వెతుకుతూ ఆరా తీయగా..చివరగా డ్రైనేజీలో కనిపించింది. 7 ఫీట్ల భారీ లోతైన డ్రైనేజీలో సుమారు ఏడాది క్రితం నుంచి డ్రైనేజీ తీయక ఇలా తయారైందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి వచ్చిన మున్సిపల్ డి ఈ భూమేశ్వరుని రామ్ నగర్ కాలనీవాసులు నిలదీసి మున్సిపల్ కమిషనర్ రాజు వచ్చేదాకా ఊరుకునేది లేదని డిఇతో వాదించారు. ఆర్మూర్ మున్సిపల్ ప్రస్తుత కమిషనర్ ఆర్మూర్ కు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ డ్రైనేజీని పరిశుభ్రపరచలేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఇంత లోతైన భారీ డ్రైనేజీకి కనీసం ఎటువంటి కంచెలు ఏర్పాటు చేయలేదని కాలనీవాసులు మున్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed