- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధరణి సమస్యల పరిష్కారం ఇక ఈజీ.. కీలక స్టెప్ వేసిన సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ధరణి అప్లికేషన్లు లక్షకు పైగానే పెండింగులో ఉన్నాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారాలను వికేంద్రీకరించారు. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ)కు మరిన్ని బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టారు. ధరణి కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సర్క్యులర్ జారీ చేశారు. గత మూడు రోజుల క్రితమే అధికారులకు ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఎలాంటి సర్క్యులర్ లేకుండానే అధికారాలను బదలాయించారంటూ పలువురు ప్రశ్నించడంతో 26వ తేదీన జారీ చేసినట్లుగా సర్క్యులర్‌ని మీడియాకు లీక్ చేయడం గమనార్హం. గతంలోనూ ప్రతి దరఖాస్తును ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో స్పష్టం చేసినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. నెలలు, ఏండ్ల తరబడి దరఖాస్తుదారులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూనే ఉన్నారు. చాలా కాలమైందని ఎవరిని అడిగితే రిజెక్ట్ చేయడం.. మళ్లీ అప్లై చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ సారైనా సీసీఎల్ఏ జారీ చేసిన ఆదేశాల మేరకు తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు ఎంత వరకు అప్లికేషన్లు పరిష్కరిస్తారో వేచి చూడాలి.
ఆర్డీవో స్థాయి:
- టీఎం 4. అసైన్డ్ భూముల విరాసత్. పాసు బుక్ లేనప్పుడు.
- టీఎం 27. పెండింగ్ నాలా అప్లికేషన్లు.
- టీఎం 33. డిజిటల్ సంతకం.
- జీఎల్ఎం. డిజిటల్ సంతకం.
అదనపు కలెక్టర్ స్థాయి:
- టీఎం 3. మ్యుటేషన్ దరఖాస్తులు
- టీఎం 24. కోర్టు కేసుల ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల జారీ
- టీఎం 31. పాసు పుస్తకాల జారీ. ఇల్లు, ఇంటి స్థలం అని ఉన్న చోట నాలా కన్వర్షన్ చేయడం.
- టీఎం 33. పాసు బుక్ తప్పొప్పుల సవరణ. పేరు తప్పు పడినా అదనపు కలెక్టర్ చేయొచ్చు.
- ఆర్డీవోకు పంపే అప్లికేషన్లను తహశీల్దార్లు పరిశీలించాలి. ఆర్డీవో కూడా వెరిఫై చేసి అదనపు కలెక్టర్ కి అప్ లోడ్ చేయాలి. వీరిద్దరి సిఫారసుల మేరకు అదనపు కలెక్టర్ చేయాలి. అయినా రిజెక్ట్ చేయాలనుకుంటే సరైన కారణాలు వెల్లడించాలి.
అప్లికేషన్ల పరిష్కారానికి గడువు
హోదా | గడువు |
తహశీల్దార్ | 7 రోజులు |
ఆర్డీవో | 3 రోజులు |
అదనపు కలెక్టర్(రెవెన్యూ) | 3 రోజులు |
కలెక్టర్ | 7 రోజులు |