Tamannah Bhatia: ‘ఓదెల-2’ ట్రైలర్ విడుదల.. పవర్ ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చిన తమన్నా భాటియా

by Hamsa |   ( Updated:2025-04-08 13:51:33.0  )
Tamannah Bhatia: ‘ఓదెల-2’ ట్రైలర్ విడుదల.. పవర్ ఫుల్ లుక్‌లో దర్శనమిచ్చిన తమన్నా భాటియా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2). అశోక్ తేజ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంపత్ నంది కథా, రచయితగా వ్యవహరిస్తున్నారు. వశిష్ట ఎన్ సింహా, హెబ్బా పటేల్(Hebba Patel) కీలక పాత్రలో కనిపించనుండగా.. తమన్నా నాగ సాధువుగా నటిస్తోంది. అయితే ఈ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఓదెల-2’ మూవీ ఏప్రిల్ 17న థియేటర్స్‌లోకి రానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘ఓదెల-2’ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను రెట్టింపు చేశారు.

ఇక ట్రైలర్ గమనించినట్లయితే.. ఓ ఆత్మ ఒక ఊరిని పట్టి పీడుస్తుంది. దీంతో ఒక్కొక్కరిగా చనిపోతారు. ఈ క్రమంలోనే తమన్నా మాస్ ఎంట్రీ ఇస్తుంది. ‘‘మనం నిలబడాలంటే భూమాత.. బతకాలంటే గోమాత.. మీరు బతకడం కోసం వాటిని చంపక్కర్లేదు వాటి ఉచ్చ అమ్ముకున్నా బ్రతకొచ్చు. ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశారు.. కానీ కలియుగంలో మొట్టమొదటిసారిగా తన నాలుక మీద ఉండే పంచాక్షరి ఆయుధం కాబోతుంది అని చెప్పే డైలాగ్స్ ట్రైలర్ మొత్తానికే హైలెట్‌గా నిలిచాయి. ఇక ఈ పోస్ట్‌కు ‘‘దైవిక, దెయ్యం మధ్య పురాణ యుద్ధం ప్రారంభమవుతుంది. శివ శక్తి.. అద్భుతమైన శక్తికి సాక్షి. ఇక శివ నామ స్మరణే’’ అనే క్యాప్షన్ జత చేశారు.




Next Story

Most Viewed