సీఎం రేవంత్ గొప్ప మనసు..జనగామ కుర్రాడి పరిస్థితిపై కీలక నిర్ణయం

by Veldandi saikiran |   ( Updated:2025-04-29 16:22:33.0  )
సీఎం రేవంత్ గొప్ప మనసు..జనగామ కుర్రాడి పరిస్థితిపై కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm revanth reddy) గొప్ప మనసు చాటుకున్నారు. జనగామ ( Jangaon ) కుర్మవాడకు చెందిన పర్శ సాయి ( Parsha sai) దీన పరిస్థితిపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. పర్శ సాయి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తన దృష్టికి వచ్చిందని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సహాయం అందించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి పై వివరాలు తెలుసుకుని ఆదేశించారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్శ సాయి ఇంటికి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెళ్లారు. ఇందిరమ్మ ఇల్లు (Indiramma's house), రాజీవ్ యువ వికాసం పథకం ( Rajiv Yuva Vikasam Scheme ) ద్వారా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సాయికి నిమ్స్ లో ( Nims) వైద్య సహాయం అందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇవాళ ఉదయం నుంచి... సాయి తల్లి లక్ష్మి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మమ్మల్ని ఆదుకోండి... లేదా నా కొడుకును చంపేయండి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 30 ఏళ్లుగా తన కొడుకును కాపాడుకుంటున్నాను... ఇక తన వల్ల కావడం లేదు... ప్రభుత్వమే ఆదుకోవాలని తల్లి లక్ష్మీ తన బాధను చెప్పుకుంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి... తన మంచి మనసు చాటుకున్నారు.




Next Story

Most Viewed