- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం ఆపి రియల్ లైఫ్ లోకి రావాలి : ఒడితల ప్రణవ్

దిశ, కమలాపూర్ : హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం ఆపి రియల్ లైఫ్ లోకి వచ్చి ప్రజాసమస్యల పై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని, చెక్కులు వచ్చి రోజులు గడుస్తున్న లబ్ధిదారులకు ఇవ్వకుండా చెక్ డేట్ అయిపోయే ముందు చెక్కులు పంచుతున్నారని ఆరోపించారు.
నియోజకవర్గంలో 200లకు పైగా చెక్కులు వచ్చి ఉన్న పేదలకు పంపిణీ చేయకుండా ఇలా చేయడం సరికాదని సూచించారు. నెల రోజులు క్రితం వచ్చిన చెక్కులను పంచడానికి కూడా ఎమ్మెల్యేకు సమయం సరిపోవడంలేదని, రీల్స్ చేయడంలో ఉన్న దృష్టి ప్రజాసమస్యలు పరిష్కరించడంలో లేదని ఎద్దేవా చేశారు. రీల్స్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లోకి కౌశల్ రెడ్డి రావాలని, రాజకీయాలు పక్కన పెట్టి చెక్కుల పంపిణీ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే లబ్ధిదారులు స్వయంగా స్థానిక మండల స్థాయి కార్యాలయానికి వెళ్లి చెక్కులను తీసుకోవాలని దీనికి అధికారులు సహకరించాలని కోరారు.