- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
దిశ, ఆదిలాబాద్ : ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, యోగాతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా శిక్షణ కేంద్రాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు.
ఆయుష్ సేవలు ప్రతి పాఠశాలకు ఎంతో అవసరమని, అందుకు పాఠశాల, కళాశాలలో యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నిత్యం యోగా సాధనతో అనేక రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం యోగాసనాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ , జిల్లా వైద్యాధికారి నరేందర్, డాక్టర్ చందు, ఆయుష్ విభాగపు వైద్యాధికారి వాణి, సుధాకర్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.