- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sircilla: కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: సిరిసిల్ల జిల్లా కలెక్టర్(Sircilla District Collector) కు కేటీఆర్(KTR) వెంటనే క్షమాపణలు(Apologize) చెప్పాలని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం(Telangana IAS Officers Association) డిమాండ్ చేసింది. బుధవారం(Wednesday) సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం సభ్యులు స్పందిస్తూ.. లేఖ(Letter) విడుదల చేశారు. ఈ లేఖలో ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులపై దుష్ప్రచారం చేయడం ఆనవాయితీగా మారడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. అలాగే సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్ చేసిన నిరాధారమైన ఆరోపణలను(Baseless Allegations) తీవ్రంగా ఖండింస్తున్నామని(Strongly Condemn), సివిల్ సర్వీస్ అధికారిపై వ్యక్తిగతంగా.. బహిరంగ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని లేఖలో పేర్కొన్నారు.
ఇక సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, కలెక్టర్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ అధికారుల సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడి కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాడని, మా పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడని, ఇటువంటి సన్నాసిని కలెక్టర్ గా తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక మీరు ఎవ్వరూ భయపడవద్దని, వీళ్లు బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరని, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని అన్నారు. ఇక అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోండి అంటూ.. కాంగ్రెస్ కార్యకర్తల్లాగ వ్యవహరిస్తే మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.