- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్‌టీఐ చట్టానికి గ్రహణం..దరఖాస్తుదారుని హోదా బట్టి సమాచారం..
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : సామాన్య ప్రజల వజ్రాయుధం మైనటువంటి సమాచార హక్కు చట్టానికి యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం నిర్వీర్యం చేస్తుంది. ఏదైనా సమాచారం ప్రభుత్వ కార్యాలయం నుండి పొందాలనుకుంటే సమాచార హక్కు చట్టం ఒక సాధనంగా ఉపయోగపడేది. కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని సమాచారం ఇవ్వకుండా దాటేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమాచారం ఇవ్వవచ్చు అనే అంశం చట్టంలో పొందుపరిచిన ప్పటికీ యాదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం సమాచారం ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తుంది. దరఖాస్తుదారుడు నచ్చితే సమాచారం ఇవ్వడం.... లేదంటే దాటవేస్తూ రిప్లై ఇవ్వడం ఈ శాఖకు పరిపాటిగా మారింది. సమాచార హక్కు చట్టం అమలు చేయడంలో ఈ శాఖ పౌర సమాచార అధికారికి అవగాహన ఉందా...? లేదా...? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి ఒక వ్యక్తి నవంబర్ 13, 2024 లో సమాచార హక్కు చట్ట ప్రకారం కొంత సమాచారం కోరుతూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో దరఖాస్తుదారుడు నాలుగు ప్రశ్నలు అడుగుతూ వాటికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ నాలుగు ప్రశ్నలు గతంలో ఈ శాఖలో నియమించిన ఉద్యోగ నియామకాలపై సమాచారం కోరారు. అయితే ఈ లేఖకు డిసెంబర్ 10న సంబంధిత శాఖ రిప్లై ఇస్తూ దరఖాస్తుదారునికి సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం ఇచ్చిన లేఖలో నోటిఫికేషన్, అర్హతలు, జీతభత్యాలు తెలిపే సమాచారం ఇస్తూ నాలుగవ ప్రశ్న అయినా ఉద్యోగానికి ఎంపికైన టువంటి అభ్యర్థుల విద్యార్హత పత్రాలు ఇవ్వడానికి వీలు లేదంటూ సెక్షన్ 8 (1) (జే)ను సాకుగా చూపుతూ సమాచారం దాటవేశారు.
ఈ సెక్షన్ ప్రకారం విద్యార్హత పత్రాలు బహిర్గతం చేయడం వ్యక్తిగతమైన అంశంగా భావించి వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలనే అంశాన్ని చెప్తూ ఈ సమాచారం ఇవ్వలేదు. అయితే ఇదే శాఖకు సమాచార హక్కు చట్ట ప్రకారం 2024 సెప్టెంబర్ లో మరో దరఖాస్తుదారుడు సమాచారం కోరుతూ దరఖాస్తు చేశాడు. ఈ దరఖాస్తులోనూ సంబంధిత శాఖ జిల్లా అధికారి తో పాటు మరికొంతమంది విద్యార్హత పత్రాలు, కమిటీల నియామకం, గడువు వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ వ్యక్తికి మాత్రం అడిగిన సమాచారం అంతా లిఖితపూర్వకంగా అప్పజెప్పారు. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన విధంగా సంబంధిత అధికారులు, సిబ్బంది యొక్క విద్యార్హత పత్రాలను కూడా బహిర్గతం చేశారు. ఒకరికి సమాచార హక్కు చట్టంలో అడిగిన సమాచారం ఇవ్వడానికి అడ్డువచ్చిన సెక్షన్ మరొకరికి అందించే విషయంలో ఎందుకు రాలేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గిరీష్ రామ్ చంద్ర దేశ్ పాండే కేసులో ఏముంది...?
గిరీశ్ రాం చంద్ర దేశ్ పాండే కేసులో 2012 లో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని ఆర్ టి ఐ ద్వారా పొందడానికి ప్రజా ప్రయోజనం అనేది బలమైన కారణంగా ఉండాలని చెప్పింది.
ఒక వ్యక్తి వ్యక్తిగత విద్యార్హత పత్రాలను అందించడానికి ప్రజా ప్రయోజనం ఉందని తేలితే సమాచారం ఇవ్వవచ్చు.సమాచార హక్కు చట్టం,2005 ప్రకారం, వ్యక్తిగత విద్యార్హత పత్రాలు వంటి సమాచారం పొందడం కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుందని సెక్షన్ 8(1)(జె) చెప్తుంది. ఎందుకంటే విద్యార్హత పత్రాలు వ్యక్తిగత సమాచారంగా పరిగణించబడతాయి. అయితే కింది పరిస్థితుల్లో ఈ సమాచారం పొందే అవకాశం ఉంటుంది.
1.ప్రజా ప్రయోజనం ఆధారంగా పొందవచ్చు..
వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం పొందిన సందర్భంలో, ఆ ఉద్యోగం కోసం నిర్దేశించిన విద్యార్హతలకు ఖచ్చితత్వం నిర్ధారించడంలో ప్రజా ప్రయోజనం ఉంటే ఆ సమాచారాన్ని ఆర్ టి ఐ ద్వారా పొందవచ్చు. ఒక అభ్యర్థి అర్హత లేనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం పొందాడనే అనుమానాలు ఉంటే, ఆ సమాచారం బయటపెట్టడం సమాజ ప్రయోజనానికి అవసరమని ఈ సెక్షన్ చెప్తుంది.
2. సాధారణ నిబంధన ప్రకారం సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కు ఆర్ టి ఐ దాఖలు చేసినపుడు దరఖాస్తుదారులు కోరే సమాచారం ప్రజా ప్రయోజనాలకు సంబంధించినది అని దరఖాస్తులో స్పష్టంగా వివరించాలి. పత్రాలు వ్యక్తిగతమైనవి అయినప్పటికీ, ఆ ఉద్యోగం ప్రభుత్వ భాద్యతల భాగంగా వచ్చినందున వాటిని ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది.
నిపుణుల అభిప్రాయం తెలుసుకుంటాం: నరసింహారావు, డీడబ్ల్యుఓ
వ్యక్తిగత అంశాలు తెలియజేసే సమాచారం ఇవ్వవచ్చా...? లేదా...? అనే అంశాన్ని నిపుణుల తో చర్చిస్తాం. గతంలో ఇచ్చిన విద్యార్హత పత్రాల విషయం ఎలా ఇచ్చారో నాకు తెలియదు.