Gambhir : భారత జట్టు కోచ్ గంభీర్‌‌పై మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Gambhir : భారత జట్టు కోచ్ గంభీర్‌‌పై మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : గంభీర్ కపట వ్యక్తి(హిపోక్రిట్) అని భారత మాజీ ఆటగాడు మనోజ్ తివారీ అన్నాడు. శుక్రవారం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘గంభీర్‌ను హిపోక్రిట్ ఎని అందుకున్నానో తెలుసా? గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశీ కోచ్‌లకు భావోద్వేగాలు ఉండవు. కేవలం డబ్బులు సంపాదించడానికే వారు భారత జట్టు కోచ్‌లుగా పనిచేస్తారు. సమయం వచ్చినప్పుడు భారత కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌ను మన దేశానికి చెందిన వారినే నియమించాలి అని గంభీర్ అన్నాడు. మరెందుకు గంభీర్ ర్యాన్ టెన్ డెస్కటే, మోర్నీ మోర్కల్‌ను నియమించుకున్నాడు. తనకు కావాల్సినదంత చేయించుకుని ఫలితాలు ఎందుకు సాధించడం లేదు. అతను మాటలకు చేతలకు పొంతను ఉండదు కాబట్టే అతన్ని ‘కపట వ్యక్తి’ అంటున్నాను. ఢిల్లీలో రంజీ మ్యాచ్ సందర్భంగా గంభీర్ నాతో గొడవకు దిగాడు. అప్పుడు తన నోటి నుంచి వచ్చిన దుర్భాషలను అందరూ విన్నారు. నా ఫ్యామిలీతో పాటు గంగూలీని సైతం ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. కొంత మంది వ్యక్తులు ఆయనను ఆ సమయంలో కాపాడారు.’ అని తివారీ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed