YS Sharmila : విభజన హామీలపై ఏపీ ప్రజలను మోసగించిన మోడీ : వైఎస్ షర్మిల

by Y. Venkata Narasimha Reddy |
YS Sharmila : విభజన హామీలపై ఏపీ ప్రజలను మోసగించిన మోడీ : వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర విభజన హామీల(State Bifur cation promises)పై ఏపీ ప్రజలను మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmil)మండిపడ్డారు. విశాఖపట్నంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్‌ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ తో కలిసి షర్మిల ఆవిష్కరించారు. ఏపీ ప్రజలను ప్రధాని మోడీ ఇప్పటికే వెన్నుపోటు పొడిచారని.. హోదా ఇస్తామని మోసం చేశారని.. మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు..

విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన చేయలేదని.. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదని విమర్శించారు. ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిన మోడీతో చంద్రబాబు సక్రమ సంబంధం... జగన్‌ది అక్రమ సంబంధమని షర్మిల దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన టీడీపీ, వైసీపీ, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని విమర్శించారు. అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని , ఆయన రాజీనామా చేయకుంటే మోడీ వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed