Pawan Kalyan:‘పిఠాపురంలో పోలీసుల తీరు బాగోలేదు’.. డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం

by Jakkula Mamatha |
Pawan Kalyan:‘పిఠాపురంలో పోలీసుల తీరు బాగోలేదు’.. డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం
X

దిశ,వెబ్‌డెస్క్: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. నా పిఠాపురం అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. నా గెలుపు రాష్ట్ర గెలుపు. ఈ క్రమంలో పిఠాపురం(Pithapuram)లో పోలీసుల(Police) తీరు బాగోలేదని వ్యాఖ్యానించారు. దొంగతనాలు బాగా పెరిగాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. పిఠాపురంలో గంజాయి పెరిగిందనే ఫిర్యాదులు పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందని మండిపడ్డారు. తన, మన అనే భేదం లేకుండా పని చేయండి అని కోరుతున్నాను అన్నారు.

ఈ నేపథ్యంలో ‘‘నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. ఈవ్ టీజింగ్ అనేది అత్యంత హేయమైన చర్య. ఆడ పిల్లలను ఏడిపిస్తే తొక్కి నార తీస్తా. ఇంకోసారి పిఠాపురంలో ఈవ్ టీజింగ్ చేస్తే సహించం. క్రిమినల్ పనులు చేసి కులాలు అడ్డుపెట్టకండి. పిఠాపురంతో మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా . పని చేస్తేనే నాకు మరోసారి అవకాశం ఇవ్వండి పని చేయకపోతే నన్ను వదిలేయండి.. పిఠాపురం బాగుండాలి. లా అండ్ ఆర్డర్ బాగోకపోతే తొక్కి నారా తీస్తా. మరో 15 ఏళ్ళు పొత్తు ఉండాలని కోరుకుంటున్నామని’’ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed