AAP: ఢిల్లీని దేశ నేర రాజధానిగా మారుస్తున్నారు- బీజేపీపై ఆప్ చీఫ్ విమర్శలు

by Shamantha N |
AAP: ఢిల్లీని దేశ నేర రాజధానిగా మారుస్తున్నారు- బీజేపీపై ఆప్ చీఫ్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP), ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి టైంలో ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై(BJP) విరుచుకుపడ్డారు. 25 ఏళ్లుగా ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టే ఇక్కడి ప్రజలపై కాషాయ పార్టీ ద్వేషం పెంచుకుందని విమర్శించారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని ‘దేశ నేర రాజధాని’ గా మారుస్తోందని మండిపడ్డారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్‌వార్‌లు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావడం కష్టంగా మారిందన్నారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తమ తమ ప్రాంతాల్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడానికి రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు నిధులు మంజూరుచేస్తామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చా. పోలీసులను భర్తీ చేయడం మా లక్ష్యం కాదు... బీజేపీ ఇప్పుడు ధర్నా పార్టీగా మారింది. రోహింగ్యాల పేరుతో పుర్వాంచల్ ప్రజల ఓట్లను బీజేపీ తొలగిస్తోందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశా" అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

పదేళ్లలో బీజేపీ ఏం చేసింది?

గత పదేళ్లలో ఢిల్లీలోని అనధికార కాలనీలకు బీజేపీ ఏమి చేసిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గత పదేళ్లలో ఆప్ ప్రభుత్వం ఈ కాలనీలలో మురుగునీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, నీటి పైపులైన్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మరోవైపు పూర్వాంచల్ ఓటర్లపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. పూర్వాంచల్‌ సమ్మాన్‌ మార్చ్‌ పేరుతో కేజ్రీవాల్ నివాసం బయట కాషాయ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ క్యాన్‌లను వాడటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed