- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Balakrishna: ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
దిశ, సినిమా: వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna) బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో రాబోతున్న చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaj). ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event)ను యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నిర్వహించనుండగా.. యూసుఫ్‌గూడ(Yusufguda) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
* జూబ్లీహిల్స్(Jubilee Hills) చెక్ పోస్టు నుంచి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వైపు వచ్చే వాహనాలను కృష్ణానగర్ వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలను శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మీదుగా మళ్లించనున్నారు.
*మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్టాప్ వైపు వెళ్లే వాహనాలను కృష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, కల్యాణ్ నగర్, మోతీ నగర్ మీదుగా బోరబండ బస్టాప్ వైపు అనుమతించనున్నారు.
* అదే విధంగా బోరబండ నుంచి మైత్రివనం జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, ఉమేశ్ చంద్ర విగ్రహం మీదుగా మళ్లించనున్నారు.
* మైత్రివనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణా నగర్ జంక్షన్ వద్ద మళ్లించనున్నారు.
* ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారు తమ వాహనాలను జానకమ్మ తోట, సవేరా ఫంక్షన్ హాల్(Savera Function Hall), మహ్మద్ ఫంక్షన్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.