Game changer: ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చేసిన మూడో పాట.. అలరిస్తున్న ‘నానా హైరానా’

by sudharani |   ( Updated:2024-11-28 16:04:54.0  )
Game changer: ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చేసిన మూడో పాట.. అలరిస్తున్న ‘నానా హైరానా’
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game changer). దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్తుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, సునీల్, సముద్రఖని, SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ఈ మూవీ జనవరి 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన టీమ్.. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ పాడిన ఈ ‘నానా హైరానా’ (NaaNaa Hyaraanaa) సాంగ్ అందరినీ అలరించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమకూర్చారు. ప్రజెంట్ ఈ మెలోడీ సాంగ్ నెట్టింట ఆకట్టుకుంటోంది.

Read More...

Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిన ‘పుష్ప’.. షార్ట్ వీడియో చేసిన అల్లు అర్జున్


Advertisement

Next Story

Most Viewed