- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: కర్నూలులో హైకోర్టు బెంచ్(High Court Bench) ఏర్పాటుపై మంత్రి టీజీ భరత్(Minister TG Bharat) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెల్లలోనే బెంచ్ ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం స్థల పరిశీలన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా స్థలం సేకరించి హైకోర్టు బెంచ్ నిర్మిస్తామని తెలిపారు. కర్నూలు(Kurnool)ను న్యాయ రాజధాని అంటూ వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని, అసెంబ్లీలో ప్రకటన కంటే ముందు ప్రక్రియ మొదలుపెట్టామని తెలిపారు. ఆరు నెలల్లోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. బెంచ్ పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణానికి ఏడాదిన్నర పట్టొచ్చని అంచనా వేస్తు్న్నట్లు పేర్కొన్నారు. లోకాయుక్త, హెచ్‌ఆర్సీ ఆఫీసులు కర్నూలులోనే ఉంటాయని, తరలింపు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ప్రచారం మాత్రమేనని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.