BRSV : బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్

by Ramesh N |   ( Updated:2024-11-28 07:58:56.0  )
BRSV : బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలేజీల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్‌ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అయిన బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలను డబ్బులు ఇవ్వాలని నాగారం ప్రసాద్ ముఠా బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

కాలేజీలో అడ్మిషన్‌తో పాటు రూ. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కాలేజీల యాజమాన్యాలపై బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నాగారం ప్రశాంత్‌పై నార్సింగి పోలీసులకు ఓ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిల్మ్ నగర్ పీఎస్ పరిధిలో నాగారం ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్ కోర్టులో నాగారం ప్రశాంత్‌ను పోలీసులు ప్రవేశ పెట్టినట్లు తెలిసింది.

Advertisement

Next Story