- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel: అరెస్టు వారెంట్లను సవాల్ చేశాం.. అంతర్జాతీయ కోర్టుని ఆశ్రయించిన ఇజ్రాయెల్
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్(Israel) ప్రభుత్వం అంతర్జాతీయ కోర్టుని ఆశ్రయించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu), రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్ (Yoav Gallant)పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)లో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అయితే, ఆ వారెంట్ ని రద్దు చేయాలని కోరుతూ టెల్ అవీవ్ అంతర్జాతీయ కోర్టుకెక్కింది. కోటులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాపై జారీ చేసిన అరెస్టు వారెంట్లను సవాలు చేశాం. ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరిస్తే ఐసీసీ మాకు వ్యతిరేకంగా ఎలా ఉందో అందరికీ తెలుస్తోంది. టెల్ అవీవ్ పై ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తుందో అమెరికాతో సహా మా మిత్ర దేశాలకు తెలుస్తోంది’ అని పేర్కొంది.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం
ఇకపోతే, ఇజ్రాయెల్- హమాస్(Israel- Hamas) మధ్య యుద్ధం వల్ల గాజాలో అనేక మంది మృతి చెందారు. ప్రధాని నెతన్యాహుతో పాటు మాజీ మంత్రి గల్లాంట్‌లు.. గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతోపాటు ఆకలిచావులు వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. దీంతో, మానవ సంక్షోభం తీవ్రమవుతుండటంతో పాటు మరణాలకు దారితీసిందని తెలిపింది. ఎంతోమంది చిన్నారులు బాధితులుగా మారారని, అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు తగినన్ని ఆధారాలు గుర్తించామని ఐసీసీ తెలిపింది. ఈక్రమంలోనే వారిపై అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. అయితే, నెతన్యాహు (Netanyahu) ఈ అరెస్టు వారెంట్‌ను ఖండించారు. అవి అసంబద్ధమైన, తప్పుడు చర్యలని పేర్కొన్నారు. అలానే, అమెరికా, ఫ్రాన్స్ కూడా నెతన్యాహుకు మద్దతిచ్చాయి. అరెస్టు వారెంట్లను తిరస్కరించాయి.