- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hemanth Soren: కాసేపట్లో సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం.. హాజరుకానున్న ప్రముఖులు
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren) గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీ (Ranchi)లోని మొరాబాదీ స్టేడియం (Morabadi Stadium)లో సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సొరెన్ (Hemanth Soren)కు చెందిన జార్ఖండ్ (Jharkhand) ముక్తి మోర్చా (JMM) ఆధ్వర్యంలోని ఇండియా కూటమి (Indian Alliance) ఘన విజయం సాధించింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను పోలింగ్ నిర్వహించగా.. జేఎంఎం కూటమి (JMM Alliance) 56 సీట్లు, ఎన్‌డీఏ కూటమి (NDA Alliance) 24 సీట్లను కైవసం చేసుకున్నాయి. దీంతో అసెంబ్లీ శాసనసభా పక్ష నేతగా హేమంత్ సోరెన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, మేఘాలయ సీఎం కొన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, శివసేన (UBT) అధినేత ఉద్దవ్ ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు.