అవమానించారని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

by Sridhar Babu |
అవమానించారని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
X

దిశ,గంభీరావుపేట : పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన చింతకింది శివ కిషోర్ (16) పదో తరగతి చదువుతున్నాడు. ఓ అమ్మాయితో శివ కిషోర్ మాట్లాడుతున్నాడని అంబటి హరిబాబు, కందుకల నవీన్, గెరిగంటి రాకేష్, కాసారం ప్రవీణ్, సోమరపు నివాస్ లు శివ కిషోర్ ను పిలిచి అమ్మాయితో మాట్లాడవద్దని, క్లాస్ మెంట్ అని చెప్పినా వినకుండా కొట్టారని తెలిపారు. అనంతరం అమ్మాయి తల్లి కూడా శివ కిషోర్ ను, అతని తల్లిని పిలిపించి ఇష్టం వచ్చినట్లు తిట్టిందని చెప్పారు. ఆ అవమానం భరించలేక శివ కిషోర్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుని తల్లి చింతకింది సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed