Maharashtra CM : కాషాయ పార్టీకే మహారాష్ట్ర సీఎం పదవి..!

by Shamantha N |
Maharashtra CM : కాషాయ పార్టీకే మహారాష్ట్ర సీఎం పదవి..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర కొత్త సీఎం(Maharashtra CM) ఎవరు అనే సస్పెన్స్ వీడనుంది. మహాయుతి కూటమిలోని బీజేపీకే సీఎం పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా సేవలందిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్‌(Devendra Fadnavis) ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోడవం ఖరారయిపోయింది. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోడీ(PM Modi), అమిత్‌ షా(Union Home Minister Amit Shah), జేపీ నడ్డాలతో ఏక్‌నాథ్‌ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్(Ajit Pawar) భేటీ కానున్నారు. ఆ తర్వాత సీఎం ప్రకటన, కేబినెట్‌ కూర్పుపై తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, మహాయుతి కూటమి గెలుపు కోసం శ్రమించిన శివసేన చీఫ్, ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ షిండే డిమాండ్ చేశారు. మళ్లీ తనకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన ఏక్ నాథ్ షిండే బుధవారం పట్టు సడలించారు. కొత్త సీఎం ఎంపికపై ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షాల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్‌ సారథ్యంలో మహాయుతి కూటమి మహారాష్ట్రలో కొలువుతీరనుంది. ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌పవార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టబోతున్నట్లు సమాచారం. నవంబర్‌ 30 లేదా డిసెంబర్‌ ఒకటో తేదీన సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని అజిత్‌ పవార్‌ వెల్లడించారు.

మహారాష్ట్ర ఎన్నికలు

కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్‌ షిండే మంగళవారం రాజీనామా చేశారు.

Advertisement

Next Story

Most Viewed