- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణంగా పడిపోయిన శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు
దిశ, వెబ్ డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిషాయి. దీంతో ఎప్పటిలాగ కాకుండా.. నెల రోజుల ముందుగానే నిండిన శ్రీశైలం జలాశయం.. గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు రెండు నెలల పాటు విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరదలు పెట్టెత్తాయి. దీంతో శ్రీశైలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 కంటే ఎక్కువ సార్లు.. గేట్లను ఎత్తారు. నెల రోజుల క్రితం వరకు నిండు కుండలా ఉన్న.. శ్రీశైలం జలాశయం.. నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయి. గురువారం నాటికి అధికారిక సమాచారం ప్రకారం..శ్రీశైలం నీటి నిల్వ 215 టీఎంసీల నుంచి 130 టీఎంసీలకు పడిపోయింది. అటు అంద్రా, ఇటు తెలంగాణకు చెందిన కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు పోటిపడి మరి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు
దీంతో నదిలో నిలువ ఉండాల్సిన నీరు భారీగా దిగువకు విడుదల అవుతుంది. ఈ కారణంతోనే శ్రీశైలం నీటి నిల్వ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తొంది. ప్రతి రోజు విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగిస్తుండగా.. ఔట్ ఫ్లో 35,315 క్యూసెక్కులు ఉంటుంది. దీంతో శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 867.40 అడుగులకు చేరుకుంది. కుడి గట్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయగా..ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతొంది. అయితే ఔట్ ఫ్లో ఇలానే కొనసాగితే మరో రెండు నెలల్లో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటిపోతుందని.. అలా జరిగితే ఎండాకాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు వార్నింగ్ ఇస్తున్నారు.