Heart attack:లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. కాపాడిన కానిస్టేబుల్

by Jakkula Mamatha |
Heart attack:లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. కాపాడిన కానిస్టేబుల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో గుండెపోటు(heart attack)తో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చాలా మంది సడెన్ హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వయసుతో సంబంధం లేకుండా పదేళ్ల చిన్నారి నుంచి పండు ముసలి వరకు గుండెపోటుకు గురవుతున్నారు. నడుస్తూ.. నవ్వుతూ, ఆడుతూ.. పాడుతూ ఇలా ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయి.. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వ్యక్తి గుండెపోటు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ(Vijayawada)) గన్నవరం రోడ్డులో నిలిపి ఉన్న లారీ క్యాబిన్‌లో డ్రైవర్(driver) కుమార్ గుండెపోటుతో కుప్పకూలాడు. చాలా సేపటిగా లారీ అక్కడే ఉంచడంతో అనుమానం వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు క్యాబిన్‌లో చూడగా డ్రైవర్ విలవిలలాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని విజయవాడ GGH కు తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో డ్రైవర్ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed