- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మందుబాబులు, జూదగాళ్లు పరుగో పరుగో (వీడియో)

దిశ, వెబ్ డెస్క్: నేరాలు, ఘోరాలు, అరాచకాలు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఇట్టే పట్టేసేలా ఏర్పాట్లు చేసింది. నేరుగా అయితే దుండగులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆకాశంలో నుంచి నిఘా పెట్టి పారిపోయే అవకాశాలకు చెక్ పెట్టింది. డ్రోన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆకాశంలో తిరుగుతున్న డ్రోన్ల ద్వారా ఈజీగా నిందితులను గుర్తిస్తున్నారు. దీంతో మందుబాబులు, జూదగాళ్లు హడలిపోతున్నారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో నేరాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. దీంతో నిఘా వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేసింది. పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో జరిగే తప్పులపై ఉక్కుపాదం మోపింది. అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేలా డ్రోన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగా అనంతపురం జిల్లాలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఆకాశంలో డ్రోన్‌ను తిప్పుతూ నేరాలను అరికడుతున్నారు. అనంతపురం శివారులో ప్రాంతంలో ఆకాశం మార్గంలో తిరుగుతూ డ్రోన్ పోలీసులకు సమాచారం అందిస్తోంది. దీంతో పోలీసులు వెంటనే ఆయా స్థలాలకు చేరుకుని నిందితులను పట్టుకుంటున్నారు. ఇలా నేరాలను అరికడుతున్నారు. ఇక ఆకాశంలో తిరిగే డ్రోన్‌ను చూసిన వెంటనే మందుబాబులు, జూదరులు అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. మహిరంగ ప్రదేశంలో మందు తాగుతున్న వారి సమాచారం అందించడంతో నాలుగు కేసులు నమోదు చేశారు.
డ్రోన్ దెబ్బతో మందుబాబులు, జూదగాళ్లు పరుగో పరుగో pic.twitter.com/iiVmlKkBsC
— vemula srinuprasad ( Chief SubEditor) DISHA DAILY (@srinuprasad1234) November 28, 2024