Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. 2D,3Dలో రీరిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ సినిమా (ట్వీట్)

by Hamsa |   ( Updated:26 April 2025 1:20 PM  )
Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. 2D,3Dలో రీరిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ సినిమా (ట్వీట్)
X

దిశ, సినిమా: రీరిలీజ్ ట్రెండ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం రీరిలీజ్‌లో హిట్ సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు మళ్లీ థియేటర్స్‌లోకి రాబోతుండటంతో సినీ ప్రియులు, అభిమానులు మరోసారి తమ అభిమాన హీరో సినిమాను చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నెలకు కనీసం రెండు మూవీస్ అయినా రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. పండుగలకు, పుట్టినరోజులకు పలు సినిమాలు వస్తూ ఊహించని విధంగా హిట్ సాధిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ హీరోలంతా తమ మూవీస్‌ను రీరిలీజ్ చేసేస్తున్నారు.

తాజాగా, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన హిట్ మూవీ ‘జగదీకవీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka Sundari )రీరిలీజ్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi), చిరు జంటగా నటించిన ఈ సినిమాను వైజయంతీ మూవీ మేకర్స్ నిర్మించారు. రాఘవేంద్ర రావు(Raghavendra Rao) దర్శకత్వం వహించగా.. అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రం 1990లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే మే 9న ఈ సినిమా 2D,3D లో రీరిలీజ్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఈవిషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.



Next Story

Most Viewed