- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ 2 నుండి పీఎల్ జీ ఏ వారోత్సవాలు
దిశ, భద్రాచలం : డిసెంబర్ 2వ తేదీ నుండి 8 వరకు పీఎల్ జీ ఏ వారోత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా జరపాలని శబరి - చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కగారి యుద్ధాన్ని తిప్పికొట్టాలని, దోపిడీ రహిత సమాజం కోసం యువతీ,యువకులు పీఎల్ జీ ఏ లో చేరాలని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్రాహ్మణీయ, హిందుత్వ పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. లొంగుబాట్లను, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు.
పీఎల్ జీ ఏ 2000 సంవత్సరం డిసెంబర్ రెండున ఆవిర్భవించిందని, ఈ డిసెంబర్ 2వ తేదీకి 24 సంవత్సరాలు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. కాగా మరో పక్క గిరిజనం బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడతారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఎల్జీఏ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా బలగాలు తెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్నారు. మావోల ఆచూకీ కోసం అడవులను జల్లెడ పడుతున్నారు.