- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదానీని చాలాసార్లు కలిశాం.. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై స్పందించిన జగన్
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ(Businessman Adani)ని చాలా సార్లు కలిశామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తెలిపారు. తన హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు(Electricity contracts), అదానిపై అమెరికా(America)లో కేసు నమోదుపై ఆయన స్పందించారు. విద్యుత్ కొనుగోళ్లలో సెకీతో తాము ఒప్పందం చేసుకున్నామని జగన్ స్పష్టం చేశారు. సెకీ ఇచ్చే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తమకు తెలియదన్నారు. విద్యుత్ తీసుకున్నామని, డబ్బులు చెల్లించామని జగన్ పేర్కొన్నారు. FBI చార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేదని చెప్పారు. తనకు లంచం ఇవ్వబోయినట్లు ఆధారాలు చూపించాలన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అదానీకి చాలా ప్రాజెక్టులున్నాయన్నారు. అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధంలేదని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్‌గా పోరాటం చేస్తామన్నారు. పరువు నష్టం దావాలు వేస్తామని జగన్ హెచ్చరించారు.