Balka Suman: అట్లయితే ఇదీ ‘క్విడ్‌ ప్రోకో’నే : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-08 09:13:22.0  )
Balka  Suman: అట్లయితే ఇదీ ‘క్విడ్‌ ప్రోకో’నే : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై కేసు నమోదు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడులు ఉదృతం చేశారు. ఫార్ములా ఈ రేసు సంస్థ గ్రీన్ కో(Green Co) బీఆర్ఎస్ కు ఎలక్ట్రోరల్ బాండ్ల(Electoral Bonds) విరాళంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మీరంటే మీరే క్విడ్ ఫ్రోకోలకు పాల్పడ్డారంటూ పరస్పర ఆరోపణ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్(BJP MP CM Ramesh) కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds)ఇచ్చాడని..అట్లయితే ఇదీ ‘క్విడ్‌ ప్రోకో’నే.. ఏమో లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక! అంటూ ఎక్స్ వేదికగా ఆరోపించారు. సీఎం రమేష్ బాండ్ల విరాళంలో తప్పేముంది అంటారా? ఏం తప్పులేదు.. కానీ చిన్న లాజిక్ ఉందని..రేవంత్‌ సీఎం అయ్యేందుకు ఎంపీ రమేష్‌ ద్వారా బడే భాయ్ మోడీ చేసిన సాయమా? ఇది అని అనుమానం వ్యక్తం చేశారు.

అయినా రేవంత్‌కు సాయం చేస్తే మోదీకి ఏమొస్తదంటరా.. అదే కదా లోగుట్టు! అని, సీఎం అయ్యాక మోదీకి రేవంత్ కొమ్ముకాయడం వెనకున్న అసలు గుట్టు అని బాల్క సుమన్ ఖ్యానించారు. అప్పుడే అయిపోలేదని..ఈ బంధం వెనకున్న భరోసా ఇంకా ఉందని..మోడీ ఆత్మీయ మిత్రుడు అదానీకి తెలంగాణను రేవంత్ దోచిపెడుతుండని, రాష్ట్రంలో అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తూ బడే భాయ్‌‌కు భజన చేస్తుండని బాల్క సుమన్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed