YS Jagan:‘మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి’.. కార్యకర్తలకు మాజీ సీఎం సూచన

by Jakkula Mamatha |
YS Jagan:‘మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి’.. కార్యకర్తలకు మాజీ సీఎం సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Government) పై మాజీ సీఎం జగన్(Former CM Jagan) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నేడు(బుధవారం) ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం పై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూశాం.. ఇక పై మరోలా చూస్తాం అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ పై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు కచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు.. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటామని కీలక హామీ ఇచ్చారు.

జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని ధైర్యానిచ్చారు. టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటింటికి వెళ్లి చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ల వరకూ హామీలు గుప్పించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయత ముఖ్యం. అప్పుడే వారికి విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా? లేదా? అనేది ముఖ్యమని వైఎస్ జగన్(YS Jagan) హితవు పలికారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం అని తెలిపారు. ఈ క్రమంలో జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనకు వస్తానని చెప్పారు. మనం ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది.. నాయకులంతా యాక్టివ్ గా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు,

Advertisement

Next Story

Most Viewed