తిరుమలలో తొక్కిసలాట.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకున్న బాలయ్య

by Mahesh |
తిరుమలలో తొక్కిసలాట.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసుకున్న బాలయ్య
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా యువ డైరెక్టర్ బాబీ(Director Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన "డాకు మహరాజ్"("Daku Maharaj") సినిమా ఈ నెల 12 సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం(Anantapur)లో జరిపేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కానీ తిరుమల లో జరిగిన తొక్కిసలాట(Stampede) నేపథ్యంలో ఈ రోజు అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్(Free release event) సహా.. అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు డాకు మహరాజ్ సినిమా నిర్మాతలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత హీరోగా బాల‌య్యకు అనంత‌పురంలో తొలి సినిమా ఈవెంట్‌ చేస్తున్న క్రమంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ చివరి నిమిషంలో ఈవెంట్ ను రద్దు చేయడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

Advertisement

Next Story