షబ్బీర్ అలీ చెంతకు మిస్టర్ పర్సంటేజ్ వ్యవహారం..

by Naveena |
షబ్బీర్ అలీ చెంతకు మిస్టర్ పర్సంటేజ్ వ్యవహారం..
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలో మిస్టర్ పర్సెంటేజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే కమిషనర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. "మిస్టర్ పర్సంటేజ్" పేరుతో "దిశ" పత్రికలో వచ్చిన కథనం మున్సిపాలిటీలో కలకలం రేపింది. దీంతో మిస్టర్ పర్సెంటేజ్ వ్యవహారం కాస్తా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి వెళ్లినట్టుగా సమాచారం.

వసూళ్లపై షబ్బీర్ అలీ సీరియస్..?

మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, వసూళ్లపై దిశ పత్రికలో వస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. దీంతో షబ్బీర్ అలీ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మిస్టర్ పర్సెంటేజ్ వ్యవహారంపై షబ్బీర్ అలీ గుర్రుగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అనేక ఆరోపణలపై మందలించినా తీరు మార్చుకోకపోవడం పట్ల సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది

పర్సెంటేజీ వద్దు.. ఏమి వద్దు...

మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల పనులు కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో కౌన్సిలర్లు నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేయడం.. ఆ విషయం దిశ పత్రికలో రావడంతో మిస్టర్ పర్సెంటేజ్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం సాగుతోంది. మిస్టర్ పర్సెంటేజ్ అంటూ తనను బద్నాం చేశారని సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా తెలిసింది. పర్సెంటేజీ వద్దు.. ఏమి వద్దు అందరి బిల్స్ క్లియర్ చేయిస్తా.. అని సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఎన్నికల కోసమేనా..?

అయితే మిస్టర్ పర్సంటేజ్ లో వచ్చిన మార్పు.. మాట్లాడే మాటల వెనుక భవిష్యత్తు కార్యాచరణ ఉండే ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 8 నెలల కాలంలోనే నాలుగైదేళ్లకు సరిపడా అప్రతిష్ట మూట కట్టుకున్న మిస్టర్ పర్సెంటేజ్.. ఇదే ప్రచారం కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులయ్యే అవకాశం ఉన్నట్టుగా గుర్తించినట్టుగా సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ప్రచారం భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందనే ఉద్దేశ్యంతో పర్సెంటేజ్ వద్దు.. ఏమి వద్దు అని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే షబ్బీర్ అలీ దృష్టిలో వ్యతిరేకత ఉన్న దృష్ట్యా కాస్త వెనక్కి తగ్గారన్న చర్చ నడుస్తోంది.

బిల్స్ క్లియర్ అయ్యేనా..

మున్సిపాలిటీలో చేసిన పనులకు సంబంధించి కోట్లలో బిల్స్ పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బిల్స్ క్లియర్ చేయడానికి 15వ ఫైనాన్స్ నిధులు ఉన్నాయని, పర్సెంటేజ్ వ్యవహారంతో ఆ బిల్స్ ఇవ్వడానికి అధికారులు సంశయిస్తున్నట్టుగా తెలుస్తోంది. పర్సెంటేజ్ వ్యవహారం షబ్బీర్ అలీ దృష్టికి వెళ్లడంతో త్వరలోనే పెండింగ్ బిల్స్ క్లియర్ అవుతాయని చర్చ జరుగుతోంది. అయితే బిల్స్ క్లియర్ అవుతాయా లేదా అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story