Game Changer : 'గేమ్ ఛేంజర్' విడుదల... థియేటర్లపై పోలీసుల నజర్

by M.Rajitha |   ( Updated:2025-01-09 16:18:26.0  )
Game Changer : గేమ్ ఛేంజర్ విడుదల... థియేటర్లపై పోలీసుల నజర్
X

దిశ, వెబ్ డెస్క్ : అగ్ర దర్శకుడు శంకర్(Shankar), తెలుగు ప్రముఖ నటుడు రాంచరణ్(Ramcharan) కాంబినేషన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్'(Game Changer) చిత్రం రేపు విడుదల కానుంది. కాగా గతంలో పుష్ప-2(Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట(Sandhya Theater Stampede) నేపథ్యంలో.. పోలీసులు ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్స్ మీద ఫోకస్ పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా విడుదలవుతున్న అన్ని థియేటర్ల యజమానులకు పోలీసులు ముఖ్య సూచనలు చేశారు. థియేటర్ల వద్ద ఎలాంటి హంగామా, హడావిడి ఉండకూడదని, నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు. టికెట్స్ ఉన్నవారిని మాత్రమే థియేటర్లలోకి అనుమతించాలని తెలియ జేశారు. కాగా తెలంగాణలో శుక్రవారం ఉదయం 4 గంటలకు గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed