TG: అసెంబ్లీ ముచ్చట్లు.. ఇవాళ చోటుచేసుకున్న ఆసక్తికర పరిణమాలివే!

by Gantepaka Srikanth |
TG: అసెంబ్లీ ముచ్చట్లు.. ఇవాళ చోటుచేసుకున్న ఆసక్తికర పరిణమాలివే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. రాజకీయంగా బద్ద శతృవులుగా మాటల తూటాలు పేలుస్తూ ఒకరిఒకరు పరసర్పరం విమర్శలు చేసుకొనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో మాత్రం అందుకుభిన్నంగా వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో వాడివేడిగా చర్చా కొనసాగుతోంది. ఈ తరుణంలో హాలులో హరీష్​రావు కూర్చున్న సీటు వద్దకే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు వెళ్లారు. ఆయన పక్కనే కూర్చోని చాలాసేపు ముచ్చటించుకున్నారు.

వీరిద్దరూ ముచ్చటించుకుంటున్న సమయంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి వారితో జత కలిశారు. కొద్దిసేపటి తరువాత శ్రీధర్​బాబు అక్కడి నుంచి లేచి తన సీటు వద్దకు వెళ్లిపోయారు. ఇదిలాఉంటే.. మంత్రి కొండా సురేఖ సీటు వద్దకు బీఆర్ఎస్​ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వచ్చి ముచ్చటించారు. ఆ తర్వాత మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వద్దకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి మాట్లాడారు. అయితే, అసెంబ్లీ హలులో చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామంతో అధికార పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల సభ్యులు సైతం ఆశ్చర్యపోయారు.

Next Story