Nandi Awards: ఏపీలో నంది అవార్డులు పునరుద్ధరించండి.. ఆ ప్రాంతాల్లో స్టుడియోలు కట్టండి..

by Anil Sikha |   ( Updated:2025-03-21 10:58:08.0  )
Nandi Awards: ఏపీలో నంది అవార్డులు పునరుద్ధరించండి.. ఆ ప్రాంతాల్లో స్టుడియోలు కట్టండి..
X

- ఏపీలో కొత్త పాలసీ నిర్ణయంపై నిర్మాతల మండలి హర్షం..

- విశాఖ, తిరుపతి, రాజమండ్రిలో స్టూడియోలు నిర్మించండి

- ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వానికి పంపాము

- వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం

- చలనచిత్ర నిర్మాతల మండలి స్పందన

దిశ డైనమిక్ బ్యూరో: ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై చలనచిత్ర నిర్మాతరం మండలి (Telugu Film producers council) స్పందించింది. ఆంధ్రప్రదేశ్​లో సినీ పరిశ్రమ (Film industry in AP) అభివృద్ధికి కొత్త విధానం తేవాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ,. లోకేష్, కందుల దుర్గేష్ కు నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని పేర్కొంది. విశాఖ, తిరుపతి, రాజమండ్రిలో స్టూడియోలు (Cine Studio's) నిర్మించాలని కోరాం అని తెలిపింది. దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరామని వెల్లడించింది. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరింది. మేము పంపిన ప్రతిపాదనలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఏపీలో తెలుగు సినీ పరిశ్రమ రాకపై నిన్న అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త పాలసీని తీసుకొస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. త్వరలో ఈ పాలసీని రూపొందిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్ లో ఉన్నాయని, స్టూడియోలు నిర్వహించడానికి ముందుకు వస్తే వారికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగు సినీ నిర్మాతలు ఇక్కడికి వచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దిల్ రాజు నేతృత్వంలో ఒక బృందం గత జూలైలో ఆయనను కలిసింది. చిత్ర పరిశ్రమలోని సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలు, తదితర కీలక అంశాలపై ఆ సమయంలో చర్చించారు. ప్రస్తుతం ఏపీలో కూటమి పెద్దలు తమ ప్రతిపాదనలను అంగీకరించాలని నిర్మాతలు మండలి కోరుతోంది.

ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల ను పునరుద్ధరించాలని నిర్మాతల మండలి కోరింది. ఈ అవార్డులను తెలంగాణలో గద్దర్ అవార్డులుగా మార్పు చేశారు. ఏపీలో మళ్లీ నంది అవార్డుల ప్రస్తావన తేవడం చర్చనీయాంశం అయింది.

Next Story